రైలు ఢీకొని యువకుని మృతి రైల్వే ఎస్ఐ సాధు లింబాద్రి
సూర్య కామారెడ్డి ప్రతినిధి:
సోమవారం 28 సెప్టెంబర్ 2026 మృతుడైన ఏ లవర్తి దేవి ప్రసాద్ ( 47) రైలు రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాధువులు మాధురి ఒక ప్రకటనలో తెలిపారు. మృతుడు ప్రైవేట్ ఉద్యోగి ఇతనికి ఇంతవరకు పెళ్లి కాలేదు మృతునికి అన్న ఏ లవర్తి దుర్గాప్రసాద్ చెల్లెలు భార్గవి ,శరవాణి మృతుని తల్లి మహాలక్ష్మి రెండు సంవత్సర కిందట మరణించినది మృతుని తండ్రి సంవత్సరం క్రితం మృతి చెందగా మృతుడు మద్యానికి బానిసై ఎలాంటి పని చేయకుండా ఒంటరితనంతో బాధపడే వాడు తల్లిదండ్రులు ఉండగా తల్లిదండ్రుల వద్దనే ఉండేవాడు ఇప్పుడు అతనికి వండి పెట్టేవారు ఎవరు లేరు తాగుడుకు బానిసై జీవితంపై విరక్తి చెంది బిక్నూర్ అక్కన్నపేట రైల్వే ట్రాక్ నంబర్ 536/15 537/1 మృతుడు రైల్వే ట్రాక్ పై ఉదయం సుమారు3. 30 గంటలకు కృష్ణ ఎక్స్ప్రెస్ రైల్ ఢీకొట్టగా మృతునికి తలకు మరియు కాళ్లకు చేతులకు గాయాలు అయినవి గాయాలైనందున మృతుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని మరణం పై ఎలాంటి అనుమానం లేదు అన్న ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు.