BREAKING
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ మార్కెట్లోకి విడుదల: ₹16.99 లక్షల ప్రారంభ ధర.. మైలేజ్, ఫీచర్లు మరియు పూర్తి వివరాలివే! పురుగుల మందు తాగి వ్యక్తి మృతి* పూల సోయగాలతో పండుగ శోభ.. సద్దుల బతుకమ్మ వైభవం ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్ సీపీ పార్టీ చైర్మన్ అభ్యర్థి తూముల రష్యాపై ఆంక్షలున్నా పాశ్చాత్య దేశాలకు భారత ఇంధనం.. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు

పుల్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
పుల్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

పుల్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

 

సిద్దిపేట రూరల్ : గ్రామంలో చెరువులు ఎన్ని ఉన్నా.. బతుకమ్మల నిమజ్జనం మాత్రం ఒకే చోట! తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామస్థులు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పలు చెరువులు, కుంటలు ఉన్నప్పటికీ మహిళలంతా ఒకే చోట ఉన్న వెంకటయ్య చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటలాడుతూ సందడి చేశారు. అనంతరం గ్రామమంతా ఒక్కటై వెంకటయ్య చెరువు వద్దకు చేరుకుని బతుకమ్మలను నిమజ్జనం చేశారు.గ్రామంలో ఇతర చెరువులు ఉన్నప్పటికీ, పూర్వీకుల కాలం నుంచి వెంకటయ్య చెరువులోనే బతుకమ్మలను నిమజ్జనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం గ్రామస్థుల ఐక్యతకు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల వారికున్న అభిమానానికి నిదర్శనంగా నిలుస్తోంది. మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పుల్లూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

(సూర్య రూరల్, రమేష్)