BREAKING
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఏక్తా నగర్ డోమ్‌లో 1000 మంది అతిథుల మధ్య ఘనంగా ప్రదానోత్సవం! 11వ ఆయుర్వేద దినోత్సవం బిగ్‌బాస్‌లో రగిలిన నామినేషన్ల మంటలు.. చరణ్, ముఖేష్ మధ్య ఘోరమైన ఫైట్! అల్పపీడనం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం గోవింద నామస్మరణతో మారుమోగిన తిరుమాడ వీధులు వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ వార్డులో రోడ్డు కబ్జా.. స్పందించిన అధికారులు నోటీసులు జారీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM) ద్వారా రూ.164 కోట్లతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు- కలెక్టర్ రాజకుమారి గణియా కుప్పంలో కృష్ణమ్మ పరవళ్లు.. కృష్ణా జలాలకు ఘనంగా జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు! శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న క్రూజర్ వాహనం, ఇద్దరు మృతి! 'ది ప్యారడైజ్' ఈవెంట్‌లో రాఘవ్ జుయల్, సుమ డ్యాన్స్ హంగామా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్! గణేష్ నిమజ్జనం నేపథ్యంలో 3 రోజులు మద్యం దుకాణాలు బంద్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 16న మూడు రాష్ట్రాల్లోని 12 స్థానాలకు పోలింగ్! గణేశ్ నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ నా సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. అభిమానుల ప్రేమకు భావోద్వేగంగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి! ఘనంగా పోషణ మాసం

ప్రమాదాలకు పిలుపునిస్తున్న పిచ్చి మొక్కలు..!

Select Suryaa Now
ప్రమాదాలకు పిలుపునిస్తున్న పిచ్చి మొక్కలు..!

ఉద్దెమర్రి–కీసర రహదారిపై మలుపులే మృత్యు ఉచ్చులు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం

శామీర్‌పేట, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 21):

మేడ్చల్ జిల్లా,మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దెమర్రి–కీసర ప్రధాన రహదారిపై పిచ్చి మొక్కలు, పొదలు విచ్చలవిడిగా పెరిగి ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మలుపుల వద్ద పొదలు అడ్డుగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు.ప్రమాదాలు జరిగిన తర్వాత మేల్కొనే పరిస్థితి కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మలుపుల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను వెంటనే తొలగించి రహదారిపై స్పష్టమైన దృశ్యమార్గం కల్పించాలని కోరుతున్నారు. అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.