ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి .
ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి
--డి ఆర్ వో అంబాదాస్ రాజేశ్వర్
మెదక్ : ప్రజావాణి దరఖాస్తులను దక్షిణ తక్షణమే పరిష్కరించాలని డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్ సూచించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమావేశ మందిరంలో అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా భూభారతి 24 ,ఇందిరమ్మ ఇండ్లు 15, పెన్షన్లు 3, ఇతర 37 మొత్తం 79 దరఖాస్తులు స్వీకరించారు.
అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని, శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ జోజి, డిఆర్డిఓ శ్రీనివాసరావు, ఏవో యూనస్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.