ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
జల్ పల్లి, శ్రీరామ కాలనీలో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు,డిప్యూటీ కమిషనర్
ప్రజ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జల్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జహంగీర్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్నగారి ఆదేశాల మేరకు సోమవారం జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధి, శ్రీరామ కాలనీ, నిత్యాఎంక్లేవ్, పలు బస్తీలలో నెలకొన్న సమస్యలపై సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి వెంకట్రామ్, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి షేక్ జహంగీర్ పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీరామ కాలనీ, నిత్యాఎంక్లేవ్ కాలనీ ప్రజలు రోడ్లు, డ్రైనేజీ లైన్, వీధిలైట్లు, మంచినీటి సదుపాయం లేక స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శ్రీరామ కాలనీ, నిత్యఎంక్లేవ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లి, నిధులు మంజూరు చేయించి, త్వరలోనే సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని షేక్ జహంగీర్ స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా షేక్ జహంగీర్ మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిహెచ్ఎంసి సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
- అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.