BREAKING
గ్రామీణ మహిళలకు గీతం, ఫైజర్ సంయుక్త శిక్షణ కామ్రేడ్ కళ్యాణ్ పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్.. శ్రీవిష్ణు కామెడీతో కచ్చితంగా నవ్విస్తాడు: డైరెక్టర్ జనకిరామ్ మారెళ్ల తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సిఐటియు యూఏడబ్ల్యూ ఎన్నికల రగడ...యూనియన్ నాయకత్వ ఎనిక కోసం మొదలైన ఓటింగ్ అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం...

పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యే మా లక్ష్యం ఎమ్మెల్యే

Select Suryaa Now
పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యే మా లక్ష్యం ఎమ్మెల్యే

పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యే మా లక్ష్యం 
రూ.74.50 కోట్లతో అర్బన్ రీజియన్ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన 
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్ పూర్ : అమీన్ పూర్ డివిజన్ పరిధిలోని గండిగూడెం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ.25  కోట్ల అంచనా వ్యాయామంతో అదనపు తరగతి గదుల నిర్మాణం, సుల్తాన్పూర్లో ఒక ఎకరం 10 గుంటల విస్తీర్ణంలో రూ.49.50 కోట్ల అంచనా వ్యయంతో ప్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలల నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు గాను 74.50 కోట్ల అంచనావయంతో నూతన అర్బన్ రీజియన్ పాఠశాలల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. 
కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని రీతిలో నాణ్యమైన ఉచిత కార్పొరేట్ విద్యను అందించడమే  ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కొత్త పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఆధునిక సైన్స్ ల్యాబ్లు లైబ్రరీలు విశాలమైన ఆట మైదానాలతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించనున్నామని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో దేవానంద్ ముదిరాజ్, సుధాకర్ రెడ్డి నరసింహ గౌడ్ సత్యనారాయణ రాజు భాస్కర్ గౌడ్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి ఎంఈఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.