BREAKING
యూఏడబ్ల్యూ ఎన్నికల రగడ...యూనియన్ నాయకత్వ ఎనిక కోసం మొదలైన ఓటింగ్ అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి

పారిశుద్ధ్య కార్మికులతో మున్సిపల్ చైర్‌పర్సన్ సమావేశం

Select Suryaa Now
పారిశుద్ధ్య కార్మికులతో మున్సిపల్ చైర్‌పర్సన్ సమావేశం
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి: మున్సిపల్ ఫిల్టర్ బెడ్ వద్ద శానిటేషన్ సిబ్బంది, ట్రాక్టర్లు, టాటా ఏస్ వాహనాల డ్రైవర్లు, శానిటేషన్ జవాన్లు, ఎస్‌ఐలతో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో జనాభా, విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా వాహన డ్రైవర్లు తమకు కేటాయించిన ప్రాంతాల్లోని చెత్తను పూర్తిగా తరలించాలని సూచించారు.ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విధులను తప్పనిసరిగా నిర్వహించి, తమకు కేటాయించిన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే శానిటేషన్ జవాన్లు, ఎస్‌ఐల ద్వారా లేదా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఆదిలాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడంలో శానిటేషన్ సిబ్బంది, ట్రాక్టర్ డ్రైవర్లు, టాటా ఏస్ డ్రైవర్లు, జవాన్లు, సమన్వయంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఆదిలాబాద్ పట్టణాన్ని స్వచ్ఛమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఎస్ఐ శంకర్ గారు , జవాన్లు శానిటేషన్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.