పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలి : ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
*పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలి*
ఉప సర్పంచ్ కాయితి శ్రీనివాస్ రెడ్డి
10 వేలు ఆర్థిక సాయం అందజేత
హర్షవర్ధన్ చేసిన చింతపట్ల గ్రామ సిబ్బంది
యాచారం : మండల పరిధిలో చింతపట్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఉప సర్పంచ్ కాయితి శ్రీనివాస్ రెడ్డి, తన సొంత నిధులతో, విజయదశమి శుభ సందర్భంగా.. బట్టలకు,10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పారిశుధ్య కార్మికులు వారి సేవలు మర్చిపోలేనివి అని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిని గ్రామపంచాయతీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ రవికుమార్ రెడ్డి, కారోబార్ ఎన్ ఆర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.