నైపుణ్యమే.. ఉపాధికి బాట:శేఖర్ రెడ్డి
ఘనంగా శ్రీ చైతన్య పారామెడికల్ కళాశాల స్వాగత వేడుకలు
చౌటుప్పల్, మేజర్ న్యూస్:వృత్తి విద్యతో నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని శ్రీ చైతన్య అకాడమీ ఆఫ్ పారామెడికల్ టెక్నాలజీ కళాశాల కరెస్పాండెంట్ కం ప్రిన్సిపాల్ ఢిల్లీ శేఖర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌లోని జయశ్రీ ఫంక్షన్‌హాల్‌లో కళాశాల స్వాగత వేడుకలను ఘనంగా నిర్వహించారు. శేఖర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాలు ఎంతో అవసరమన్నారు. పారామెడికల్ రంగంలో నైపుణ్యం సాధించిన వారికి విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం, ప్రాయోగిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని భవిష్యత్తులో మంచి నిపుణులుగా ఎదగాలని సూచించారు.కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు బొమ్మ లింగస్వామి, బాతరాజు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.