BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

మేడ్చల్‌లో బీజేపీ కార్యకర్తల నిరసన

Select Suryaa Now
మేడ్చల్‌లో బీజేపీ కార్యకర్తల నిరసన

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం

మేడ్చల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 29): హిందూ దేవుళ్లైన శ్రీరాముడు, శివుడిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్ పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ మేడ్చల్ అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించి, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా జెల్లీ శైలజ హరినాథ్ మాట్లాడుతూ.. హిందూ దేవుళ్లను రాజకీయ వ్యాఖ్యల్లోకి తీసుకురావడం సరికాదన్నారు. శ్రీరాముడు, శివుడిపై సీఎం చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టామని, తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆందోళన చేపట్టాల్సి వచ్చిందన్నారు.హిందూ దేవుళ్ల విషయంలో అనుచిత వ్యాఖ్యలు పునరావృతమైతే బీజేపీ ఆధ్వర్యంలో మరింత తీవ్రంగా నిరసనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. రాజకీయ విమర్శలకు మతపరమైన అంశాలను ఉపయోగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాకెట్ల ప్రేమ్‌దాస్, శ్రీనివాస్ గౌడ్, రాగం అర్జున్, రామన్నగారి శ్రీనివాస్ గౌడ్, బచ్చు కృష్ణప్రియతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రిపోర్టర్ తలారి శివకుమార్.