సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రామ్‌ల్యాం' అమలులో భాగంగా ఎన్‌ఆర్‌ఎల్‌ఎం పథకం కింద బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాదు గ్రామీణ మండలం రాజర్షిషాగూడ గ్రామానికి చెందిన అర్హులైన మహిళ సంఘాల సభ్యులకు ఆయన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ పథకం అమలులో భాగంగా గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఝాన్సీ లక్ష్మీ, అంజలి మహిళా సంఘాలను గుర్తించి వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో గ్రూపులో నలుగురు సభ్యుల చొప్పున గుర్తించి, వారికి రూ. 1 లక్ష చొప్పున (ఒక్కొక్కరికి రూ. 25,000) రుణం అందించామని తెలిపారు. ఈ ఆర్థిక సహాయంతో మహిళలు మేకల పెంపకం చేపట్టి, వాటిని సక్రమంగా పెంపకం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, ఏపిఎం అనిల్, డిపిఎం శోభా, సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.