BREAKING
ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మిట్స్‌లో ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్,ఓపెన్ సైన్స్‌పై అవగాహన సదస్సు అంగన్వాడీ కేంద్రాల్లో బీజేపీ నాయకుల పర్యటన

లక్ష్య సాధనపై ఉన్నత స్థాయి సమీక్షా

Select Suryaa Now
లక్ష్య సాధనపై ఉన్నత స్థాయి సమీక్షా
సూర్య, మందమర్రి.;మందమర్రి ఏరియాలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని ఆన్యువల్‌ ప్లాన్‌, టార్గెట్‌ కమిటీలు అధికారులకు సూచించాయి. 2026-27 ప్రస్తుత లక్ష్యాల పురోగతితో పాటు 2027-28 వార్షిక ప్రణాళికపై మంగళవారం జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్‌ కార్యాలయం నుంచి ఈ సమావేశానికి విచ్చేసిన కమిటీ సభ్యులు జీఎంలు దేవేందర్‌, నరసింహారావు, డీజీఎం గాబ్రియేల్‌రాజు, గని మేనేజర్‌ ప్రసాద్‌తో పాటు ఏడుగురు అసోసియేటెడ్‌ అధికారులు పాల్గొనగా వారికి ఏరియా జీఎం ఎన్‌. రాధాకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్‌ తొలగింపు వివరాలను కమిటీ పరిశీలించింది. మిగిలిన కాలంలో లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన ఉత్పత్తి లక్ష్యాలు, వాటి సాధనకు రూపొందించిన యాక్షన్‌ ప్లాన్‌ను అధికారులు వివరించారు. ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో ఉత్పత్తి, ఓబీ తొలగింపుతో పాటు భూగర్భ గనుల్లో డెవలప్‌మెంట్‌, డిపిల్లరింగ్‌ పనుల పురోగతిని సమీక్షించారు. కార్మికుల ఉత్పాదకత పెంపు, భారీ యంత్రాల గరిష్ఠ సామర్థ్య వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. గనుల విస్తరణకు అవసరమైన భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, పర్యావరణ, అటవీ అనుమతుల పురోగతిని కమిటీ తెలుసుకుంది. లక్ష్య సాధనకు అడ్డంకిగా ఉన్న సాంకేతిక, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన కార్పొరేట్‌ సహకారం అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ గనుల ఏజెంట్లు, పీఓలు, గని మేనేజర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.