telanagana
కాంగ్రెస్కు రాయిసిడం రాజేశ్వర్ గుడ్బై చెప్పనున్నారా?
సూర్య తిర్యాణి : తిర్యాణి మండలంలోని ఉమ్మడి మంగి గ్రామపంచాయతీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాయిసిడం రాజేశ్వర్ పార్టీ మారనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించలేదనే అసంతృప్తితో ఆయన పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఆయన నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన తదుపరి రాజకీయ అడుగులు ఏ పార్టీ వైపు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్లో చేరుతారా? లేక బీజేపీ వైపు అడుగులు వేస్తారా? అన్న చర్చ స్థానికంగా కొనసాగుతోంది. ఈ ప్రచారంపై రాయిసిడం రాజేశ్వర్ స్పందన, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి