BREAKING
లో వోల్టేజ్ సమస్యకు చెక్ బ్రిటన్ కొత్త ఆర్థిక మంత్రి చాన్స్ లీ తొలి బడ్జెట్ బతుకమ్మ సంబురాల్లో మహిళలతో కలిసిమెలిసి సందడి చేసిన మెచ్చా నాగేశ్వరరావు భద్రాచలం నూతన ట్రాఫిక్ ఎస్ఐగా పడాల కేశవ. ప్రయాణ ప్రాంగణమా? మురుగు నిలయమా? ప్రయాణికుల సౌకర్యం కోసం 24 గంటల ఎంక్వయిరీ సేవలు ప్రజా సమస్యలపై రాచమల్లు దంపతుల క్షేత్రస్థాయి పర్యటన… అధికారుల తీరుపై ఆగ్రహం రేణిగుంటలో ఎన్నికల కోడ్‌ అమలు.. కర్నూలు జీవి మాల్ లో భారీ అగ్నిప్రమాదం చిన్న గుర్రాయిగూడెంలో వైభవంగా కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులతో కిటకిటలాడుతున్న అమ్మవారి ఆలయం ఒడిశాలో మరో 2.91 లక్షల గ్రామీణ ఇళ్ల నిర్మాణం: 'అంత్యోదయ గృహ యోజన'ను 2029 వరకు పొడిగించిన మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం! ధర్మ రక్షణకు అవసరమైతే బాంబులు, ఫిరంగులు ప్రయోగిస్తాం.. సీఎం యోగి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మద్దతు! మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నందిగామలో గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాంకాక్‌లో నిర్మలా సీతారామన్ కీలక సంభాషణ: అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్షిక సదస్సులో మైఖేల్ కుగెల్‌మన్‌తో భారత ఆర్థిక వృద్ధి, గ్లోబల్ సరఫరా గొలుసులపై చర్చ!

హుస్నాబాద్‌లో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వ జీవో జారీ

Select Suryaa Now
హుస్నాబాద్‌లో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వ జీవో జారీ

సిద్దిపేట ; హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్  కృషితో హుస్నాబాద్ నియోజకవర్గంలో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసి, గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఈ అకాడమీ ఏర్పాటు కానుంది.

కబడ్డీ అకాడమీ జీవోలోని ముఖ్యాంశాలు:

 హుస్నాబాద్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లాలో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి.
అకాడమీలో మొత్తం 40 మంది క్రీడాకారులకు అవకాశం కల్పించనున్నారు. ఇందులో 20 మంది బాలురు, 20 మంది బాలికలు ఉంటారు.
- బాలురు, బాలికలకు వేర్వేరుగా కబడ్డీ కోచ్‌లను నియమించనున్నారు.
- బాలురు, బాలికల కోసం వేర్వేరుగా వార్డెన్లతో పాటు గ్రౌండ్స్‌మెన్, స్వీపర్, సెక్యూరిటీ గార్డు సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
 మొత్తం 8 సేవల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నియామకాలు ఔట్‌సోర్సింగ్ విధానంలో చేపట్టనున్నారు.

క్రీడాకారులకు ప్రయోజనం

ఈ అకాడమీ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల యువ క్రీడాకారులకు కబడ్డీలో శిక్షణ పొందేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి. బాలురు, బాలికలకు సమానంగా అవకాశం కల్పించడం ద్వారా క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడనుంది.హుస్నాబాద్ ప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ అకాడమీ ఏర్పాటు కీలక అడుగుగా నిలవనుంది.ఇప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గంలోనీ గ్రామాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ గుర్తింపు సాధించారు. కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు హుస్నాబాద్ నియోజకవర్గంలోని పల్లెల్లో మట్టిలో మాణిక్యాలు వెలికి తీసి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయవచ్చని నియోజకవర్గ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్  చొరవతో హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడాకారులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రావడంపై నియోజకవర్గ ప్రజలు , విద్యార్థులు , యువత స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.