BREAKING
సూర్య పత్రిక చైర్మన్, SPR పబ్లికేషన్స్ చైర్మన్ శ్రీ నూకారపు సూర్య ప్రకాశరావు గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు! ????????సూర్య పత్రిక చైర్మన్, SPR పబ్లికేషన్స్ చైర్మన్ శ్రీ నూకారపు సూర్య ప్రకాశరావు గారికి "మా అమ్మను ఎలా బలి చేస్తారు?" స్త్రీవాద ఉద్యమ శిఖరం గ్లోరియా స్టెయిన్మ్ (92) కన్నుమూత ఆటో రంగానికి పీయూష్ గోయల్ పిలుపు అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వస్త్ర వ్యర్థాల నుండి విలువైన ఉత్పత్తులు భారత్‌ను ‘ప్రపంచ శక్తి’గా అభివర్ణించిన ఉక్రెయిన్ ‘యుద్ధభూమిలో పరిష్కారాలు లభించవు’ సోనూసూద్: రీల్ లైఫ్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరో వరకు 'బయో-నివేష్' వేదికను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆది'కేనా అమాత్య పదవి!? - కొండా’పై వేటు.. ‘ఆది’కి రూట్ క్లియర్..?! - అధిష్టానం నిర్ణయంతో దేవాదాయ పీఠం దక్కేనా? -  బీసీ అస్త్రం, మున్నూరు కాపు సమీకరణం -  రేసులో దూసుకెళ్తున్న ఆది శ్రీనివాస్ భారత్ ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక రాజకీయ శక్తి కేంద్రం సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తితో రక్షణ రంగంలో భారత్-బెల్జియం భాగస్వామ్యం బలోపేతం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్పీకర్ ఓం బిర్లా

"మా అమ్మను ఎలా బలి చేస్తారు?"

Select Suryaa Now
"మా అమ్మను ఎలా బలి చేస్తారు?"

రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కొండా సుస్మిత
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌ అంశంపై ఆమె కుమార్తె కొండా సుస్మిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ, ఆయన బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

"రేవంత్ రెడ్డి కేవలం వన్ టైమ్ జెడ్పీటీసీ, వన్ టైమ్ ఎమ్మెల్సీ, వన్‌టైమ్ ఎమ్మెల్యే మరియు వన్ టైమ్ ఎంపీ మాత్రమే. కానీ మా అమ్మ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. అలాంటి నేతను రేవంత్ రెడ్డి తీవ్రంగా అవమానించారు." "నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేవలం ఒక వ్యక్తి (రేవంత్ రెడ్డి) వైఖరికి వ్యతిరేకంగా మాత్రమే నా గళం విప్పాను."

"గతంలో బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనప్పుడు, కొడుకు చేసిన తప్పుకు బండి సంజయ్‌ను ఎలా అరెస్ట్ చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరి అలాంటప్పుడు నేను చేసిన వ్యాఖ్యలకు మా అమ్మను ఎలా బలి చేస్తారు?" అని సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించిన కొండా సుస్మిత వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.