telanagana
గాయత్రి మహాక్షేత్రంలో వనదుర్గాదేవిగా అమ్మవారి దర్శనం
శామీర్పేట, మేజర్ న్యూస్ :మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్పేట డివిజన్ తూంకుంటలో ఉన్న శ్రీ గాయత్రి మహాక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం అమ్మవారిని వనదుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ ధర్మకర్త, వాక్బ్రహ్మ, శిష్య జనోద్ధారక డాక్టర్ ఎస్.వి.ఎల్.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.వి.ఎల్.ఎన్. మూర్తి మాట్లాడుతూ..... శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులతో పాటు నగరం, వివిధ మండలాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, శామీర్ పేట్, మేడ్చల్ జిల్లా.