telanagana
ఎస్ ఏ 1పరీక్ష సరిళి ని పర్యవేక్సించిన డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ
సూర్య జైనూర్ : కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల్ కేంద్రం లోని ఆశ్రమ పాఠశాల,బాలికలు లో జిల్లా గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు జాదవ్ అంబాజీ బుధవారం ఆకస్మికంగా సందర్శించి ఎస్ ఏ 1పరీక్షల సరళిని పర్యవేకశించి ఉపాధ్యాయులకుసలహా సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, పరీక్షల విధి విధానాలు , వసతి గృహ నిర్వహణ, భోజనశాల, వంటశాల, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, వైద్య సదుపాయాలు, విద్యార్థుల భద్రతా చర్యలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, భోజనం నాణ్యత, వసతి సౌకర్యాలు, ఆరోగ్యం, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థినికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారం అందేలా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, విద్యా సౌకర్యాలు విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.అనంతరం పాఠశాలల్లోని రికార్డులు, విద్యార్థుల హాజరు, వసతి గృహ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి, విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలల నిర్వహణ మరింత మెరుగుపడాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన లక్ష్యమని జాదవ్ అంబాజీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆత్రం పార్వతి ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.