ఏఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దాండియా, బతుకమ్మ సంబరాలు
ఏఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దాండియా, బతుకమ్మ సంబరాలు .
మునగనూరులో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
దాండియా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి,పరిసర ప్రాంతాల మహిళలు
మున్సిపల్ సిబ్బందికి, ఆశవర్కర్స్ కు దుస్థుల పంపిణి.
ఆదిభట్ల సర్కిల్ తొర్రూరు డివిజన్ మునగనూరు శాంతి నికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్యూషన్ పక్కన గ్రౌండ్ లో ఏఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, 53,56 డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి హాజరై మహిళలతో బతుకమ్మ, దాండియా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు హెల్త్ క్యాంప్ లు, కరోనా విపత్కర పరిస్థితి లలో ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు అందజేస్తున్నారన్నారు. యువత చెడు దారిలో వెళ్ళకుండా డ్రగ్స్ పై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. అనంతరం అంగన్వాడి టీచర్లు, మున్సిపల్ సిబ్బందికి చీరలు, బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అందేల శ్రీరాములు,హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, తుర్కయంజాల్ మాజీ కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్ కుమార్,ఎలిమినేటి భరత్ రెడ్డి, నందగిరి సురేష్,కొలను రవీందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నవీన్ రెడ్డి, దినేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్.