BREAKING
చర్చలు, దౌత్యమే రష్యా-ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి ఏకైక మార్గం: అంతర్జాతీయ వేదికపై భారత్ పునరుద్ఘాటన! తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఏ డి ఏ రాధ. పాఠశాలలో వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఘనంగా సేవా జ్యోతి యాత్ర ఆర్మీ జవాన్ ఘన సన్మానం *ప్రధాన కూడళ్లలో పోలీసులు నిరంతరం గస్తీ..* సీబీఐ విస్తృత సోదాల్లో ఎలాంటి ఆధారాలూ లభించలేదు: ఎన్నికల ముందు బీజేపీ కుట్రలంటూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ధ్వజం! ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి సి జి ఎఫ్ నిధులతో ఆలయాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి అగ్ని ప్రమాద బాధితుడుకు ఆర్థిక సహాయం వైజాగ్ మెట్రో, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం తెలపండి: ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్న సీఎం చంద్రబాబు! చిల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి ధార్మిక సమితులు నిరంతరం నిర్వహించాలి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు చివరి అవకాశం పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

ధారూర్ బస్టాండ్ నీటి ట్యాంక్‌లోకి మురుగునీరు

Select Suryaa Now
ధారూర్ బస్టాండ్ నీటి ట్యాంక్‌లోకి మురుగునీరు

దుర్వాసనతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు

ధారూర్,మేజర్ న్యూస్ (అక్టోబర్ 7):

ధారూర్ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న నీటి ట్యాంక్‌లోకి మురుగునీరు చేరి కలుషితం కావడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.దీనివల్ల బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు,స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.నీటి ట్యాంక్ సరిగ్గా మూసివేయకపోవడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో మురుగునీరు ఇందులో కలుస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.కలుషిత నీటి నుంచి వస్తున్న దుర్వాసనతో పాటు దోమలు,ఈగలు ముసురుతుండటంతో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రజా ఆరోగ్య దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కలుషితమైన ఈ ట్యాంక్‌ను శుభ్రం చేయించాలని, మురుగునీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రయాణికులు,స్థానికులు కోరుతున్నారు.

రిపోర్టర్: సుధాకర్, దారూర్, వికారాబాద్ జిల్లా.