అగ్ని ప్రమాద బాధితుడుకు ఆర్థిక సహాయం
సంతబొమ్మాలి సూర్య: మండలంలో నౌపడ అగ్నిప్రమాద బాధితుడు కర్రీ నాగరాజుకు టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి 5000 రూపాయలు ఆర్థిక సహాయం బుధవారం అందజేశారు. ఈ డబ్బులతో రేషన్, దుస్తులు కొనుక్కోవాలని సూచించారు. త్వరలోనే రెవెన్యూ అధికారులు బియ్యాన్ని అందజేస్తారని తెలిపారు. బాధితుడు నివాసం ఉండడానికి రేకుల షెడ్ నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరగా అందుకు శాంతి స్వరూప్ రెడ్డి హామీ ఇచ్చారు.