లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ*
*లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ*
మునుగోడు,మేజర్ న్యూస్:
మండలంలోని కొంపల్లి గ్రామంలో బుదవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా కొంపల్లి గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మలదశరథ,ఉప సర్పంచ్ వెదిరే విజేందర్ రెడ్డి లు ముఖ్య అతిథిలుగా హాజరై చేతుల మీదుగా అర్హత గల లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపాలన అధికారి లోయపల్లి సైదులు, పంచాయతీ కార్యదర్శి సురేష్,వార్డు సభ్యులు జీడిమడ్ల ఇందిరమ్మ, జీడిమడ్ల నరేష్, జాల నర్సింహ, జీడిమడ్ల మౌనిక, సూర శ్రీశైలం, దాము కేతమ్మ, బోయపర్తి ప్రసాద్, సూర సురేశ్, గోలి పార్వతి, గ్రామస్తులు జీడిమడ్ల దశరథ,మక్కెన కోటేశ్వరరావు, చేపూరి జయరాములు, సంకు శంకర్, మొగుదాల రవీందర్, వక్కంటి సుమన్, బోయపర్తి గణేష్, సూర నర్సింహ, రేషన్ డీలర్ ఎదుల్ల వెంకటమ్మ,లబ్ధిదారులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
*పులిపల్పుల గ్రామంలో.....*
మండలంలోని పులిపలుపుల గ్రామంలో బుదవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అర్హులైన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
గ్రామ సర్పంచ్
కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు,
మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణతో కలిసి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పందుల అంజయ్య, గ్రామ పాలకవర్గం కంభంపాటి రాము అరుంధతి, లింగస్వామి, పగిల్ల రాము, బిక్షం, శంకర్, గ్రామ సెక్రెటరీ గుండగోని సతీష్,సిపిఐ జిల్లా నాయకులు బోలుగురి నరసింహ,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొంపెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
*కల్వకుంట్ల గ్రామంలో....*
మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో బుదవారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో అర్హులైన లబ్దిదారులకు మంజూరు అయిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
గ్రామ సర్పంచ్ సింగపంగ లక్ష్మమ్మ లక్ష్మయ్య,ఉప సర్పంచ్ బొందు రవి లు ముఖ్య అతిథిలుగా హాజరై లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మమత,వార్డు సభ్యులు సింగపంగ ముత్తయ్య,బి అండాలు,బి
యాదయ్య, రేషన్ డీలర్ వనం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
*బీరెల్లిగూడెం గ్రామంలో...*
మండలంలోని బీరెల్లిగూడెం గ్రామంలో బుదవారం అర్హులైన లబ్దిదారులకు మంజూరు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ సర్పంచ్ దాసరి గోవర్ధన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ధోటి వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శి చిరుమర్తి వెంకన్న , రేషన్ డీలర్ సత్యనారాయణ , గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి సత్యనారాయణ, పాలకవర్గం సభ్యులు దాసరి మహారాజ్, వెంపల్ల కవిత శేఖర్, దాసరి రమ్య రాంబాబు, మహిళా సంఘం అధ్యక్షురాలు దాసరి ఊర్మిళ, గ్రామ పెద్దలు దాసరి రాములు ,దోటి శీను, వెంపాల నరసింహ, దోటి శ్రీశైలం, బూడిద లింగస్వామి, వేంపల్ల రాజమౌళి మండలి శంకర్ దాసరి మల్లయ్య, వెంపాల రాములు, తదితరులు పాల్గొన్నారు.
*చల్మెడ గ్రామంలో....*
మండలంలోని చల్మెడ గ్రామంలో బుదవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బండమీది యాదయ్య, ఉప సర్పంచ్ అవిశెట్టి మల్లేష్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ జానకమ్మ , గ్రామపాలన అధికారి శ్రవణ్,వార్డు మెంబర్లు గంగదేవి సావిత్రమ్మ, నెల్లికంటి కృష్ణవేణి , ఫీల్డ్ అసిస్టెంట్ ప్రేమిలత, ఆశా వర్కర్ నందిపాటి జ్యోతి, అంగన్వాడి టీచర్ లలిత తదితరులు పాల్గొన్నారు.