telanagana
భీంపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Telanagana
06 Oct 2026
18 views
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి ;జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ భీంపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న వాహనాల ప్రస్తుత స్థితిగతులను, నిర్వహణ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సత్వర న్యాయం అందించే దిశగా కృషి చేయాలని ఎస్పీ సూచించారు. ప్రజలతో మంచి సత్సంబంధాలను కొనసాగిస్తూ పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలని తెలిపారు. నేరాల నియంత్రణకు బీట్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేస్తూ గ్రామాల్లో నిరంతరం పర్యటించాలని సూచించారు. గ్రామాల్లో గంజాయి, సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడంతో పాటు, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేయాలన్నారు. చిన్నారులు, మహిళల పట్ల వేధింపులు లేదా ఇతర నేరాలకు పాల్పడినట్లయితే వెంటనే పోలీసులను ఆశ్రయించేలా ప్రజల్లో భరోసా కల్పించాలని, ఫిర్యాదు అందిన వెంటనే చట్ట ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మండలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘ వ్యతిరేక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలకు ఎలాంటి సమాచారం ఉన్న నిర్భయంగా 8712659973 నెంబర్ కి వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు, ఈ వాట్సాప్ నంబర్ జిల్లా ఎస్పీచే నిర్వహించబడుతుంది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి. శ్రావణ్, భీంపూర్ ఎస్సై పీర్ సింగ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Latest News