telanagana
బీబీపేట్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర
సూర్య బీబీపేట్ : మండల కేంద్రం లో కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర బీబీపేట్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఆస్తి సంబంధిత నేరాల నివారణ: గ్రామాల్లో దొంగతనాలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.నిరంతర గస్తీ నిర్వహణ: ముఖ్యమైన ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై నిఘా ఉంచాలి.112 అత్యవసర కాల్స్కు తక్షణ స్పందన: డయల్ 112 ద్వారా వచ్చే అత్యవసర కాల్స్కు వెంటనే స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తగిన సహాయం అందించాలి.
దొంగతనం కేసుల త్వరితగతిన ఛేదన: దొంగతనం కేసులను త్వరితగతిన ఛేదించి, నిందితులను గుర్తించి పట్టుకుని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.విధుల నిర్వహణలో మెరుగైన పనితీరు: పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ మెరుగైన పనితీరును కనబరచాలి.పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత: పోలీస్ స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి కొరరు. ఈ కార్యక్రమం లో ఎస్ ఐ నవీన్ చంద్ర మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.