*బాధితురాలుకు లక్ష రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న మాలోతు బిచ్చు నాయక్ ఆరోగ్యం: యువతకు వ్యాయామమే రక్ష*అద్దంకి కృష్ణ
తుంగతుర్తి మేజర్ న్యూస్
మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన బాధితురాలు సిగ్నేత కు లక్ష రూపాయలు ఇచ్చి మాలోతు బిచ్చు మానవత్వాన్ని చాటుకున్నాడు.
ఇటీవల గొట్టిపర్తికి చెందిన కుంచం కళ్యాణ్ కుమార్తె సిగ్నేత రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తల, చెవికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్సకు రూ.15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆదివారం వారి కుటుంబానికి మాలోతు బిచ్చు నాయక్ 1,00000 ఆర్థిక సాయం చేసి మానత్వాన్ని చాటుకున్నారు. చిన్నారి త్వరగా కోరుకోవాలని దేవుని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వారిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.