అంతారంలో ఐమాక్స్ లైట్ల ఏర్పాటు
కుల్కచర్ల, మేజర్ న్యూస్ : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామంలో తిరుమలాపూర్ గ్రామానికి చెందిన యువ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామంలో రాత్రి వేళల్లో వెలుతురు సౌకర్యం మెరుగుపడటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా లైట్లను ఏర్పాటు చేయించడం పట్ల శ్రీనివాస్ గౌడ్ను గ్రామస్తులు అభినందించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు యువత ముందుకు రావడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పృథ్వీరాజ్ గౌడ్, ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు పాండు, స్థానిక నాయకులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.