అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
చౌటుప్పల్: మేజర్ న్యూస్ :పట్టణంలోని బాలాజీ టెంపుల్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని డా. చిలకల శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన సతీమణి రామాదేవి, కుమార్తె డా. గిరీష్మ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రేమ, దయ, సేవాభావం పెంపొందించుకోవాలని, కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో జీవించాలని కోరారు. ఆలయ పూజారి సంతోష్ పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, రామాలయం ధర్మకర్త యేసు యాదవ్, పర్వతాలు యాదవ్, బత్తుల శ్రీశైలం, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కనుగు నర్సింహ, వేణు యాదవ్, వెంకటేష్ యాదవ్, మారుతి వికాస్ యాదవ్, జగదీష్, మల్లేష్, మహిళలు దుర్గాదేవి, శిరీష తదితరులు పాల్గొన్నారు.