telanagana
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ కార్యక్రమాలు
సూర్య,పెంచికల్‌పేట్: మండలంలోని ఎల్లూరు, ఎర్రగుంట గ్రామాల అంగన్వాడీ కేంద్రాల్లో పోషణమాసం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులకు బాల అమృతం, పౌష్టికాహారం, కిషోర బాలికలకు చిక్కీలు పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిషోర బాలికలు పోషకాహార పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు చప్పిడే రవీందర్, పొట్టే ఉమా మహేశ్, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.