సూర్య, చింతలమానేపల్లి : మండలంలోని బాలాజీ అంకోడ రైతు వేదికలో బుధవారం మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమావేశం విజయవంతంగా నిర్వహించారు.ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు.