BREAKING
రాజమహేంద్రవరంలో పోషణ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎంపీ పురందేశ్వరి ఆదిలాబాద్ రిమ్స్‌ అగ్నిప్రమాదం: ఇద్దరు పసికందుల మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న విఆర్ఏల ధర్నా ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవం శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్టీయు కృత్రిమ మేధస్సు ప్రమాదాల కట్టడికి గ్లోబల్ రెగ్యులేటరీ సంస్థ: 20 దేశాల కీలక ఉమ్మడి ప్రతిపాదన గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత వీఎల్‌ఎస్‌ఐ సాంకేతికతతో తదుపరి తరం బయోసెన్సర్‌ డిజైన్‌పై వర్క్‌షాప్ రాయవరంలో వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక ద్రవ్యోల్బణ సెగతో ఆర్బీఐ కీలక నిర్ణయం?: 2026లో రెండుసార్లు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చన్న నివేదిక ఐరాస వేదికగా దౌత్య పర్వం పాకిస్తాన్‌లో మరో పరువు హత్య: నవవధువును కాల్చి చంపిన సొంత సోదరుడు.. కరాచీలో దారుణం ప్రభుత్వ కార్యాలయంలోనే దొంగతనం.. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం తప్పనిసరి నల్ల సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛకు భారత్ సహకారం స్లాఘనీయం

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ పోడియం

Select Suryaa Now
ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ పోడియం

10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో హిమాంశుకు రజతం, రుద్రాంకష్‌కు కాంస్యం
ఐచి-నగోయా:ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తా చాటారు. సోమవారం హోరాహోరీగా జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ పోరులో హిమాంశు ధిల్లాన్ రజత పతకం సాధించగా, రుద్రాంకష్ పాటిల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒకే విభాగంలో ఇద్దరు భారత షూటర్లు పతకాలు సాధించడంతో భారత్‌కు డబుల్ పోడియం దక్కింది. చైనాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ షెంగ్ లిహావో 254.2 పాయింట్ల గేమ్స్ రికార్డుతో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నాడు.

ఎనిమిది మంది పాల్గొన్న ఈ ఫైనల్ పోటీలో ఆరంభం నుండి భారత షూటర్లు అద్భుత ప్రతిభను కనబరిచారు. తొలి 10 షాట్ల ముగిసేసరికి రుద్రాంకష్ 106.0 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, హిమాంశు కూడా వరుసగా 10.9తో సహా ఉత్తమ స్కోర్లు సాధిస్తూ పోటీలో నిలిచాడు. ఎలిమినేషన్ రౌండ్లు సాగుతున్న కొద్దీ తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. చైనా షూటర్ షెంగ్ క్రమంగా పాయింట్ల అంతరాన్ని తగ్గించుకుంటూ ముందుకు వచ్చాడు.

మంగోలియా షూటర్ నిష్క్రమణతో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఆ తర్వాత జరిగిన చివరి రౌండ్లలో హిమాంశు 252.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకోగా, రుద్రాంకష్ 230.9 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్యంతో మెరిశాడు. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత షూటింగ్ బృందం తమ ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది.