తుల రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Libra Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
తులా రాశి… వారం ప్రారంభంలో వృత్తి, వ్యాపారాల్లో గుర్తింపు, గౌరవం, నూతన స్నేహబంధాలు, ప్రయాణాల్లో ప్రశాంతత లభిస్తాయి. భాగస్వామి, జీవితసహచరి, సిబ్బంది సహకారంతో పనులు సాధిస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెద్దల ఆశీస్సులు, దూరప్రాంత వ్యక్తుల సహకారంతో ఆర్థికాభివృద్ధి, నిరుద్యోగులకు అవకాశాలు కలుగుతాయి. మధ్యలో వృత్తిపరమైన శ్రమ, బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్య పనుల్లో జాప్యం ఉండవచ్చు. కమ్యూనికేషన్, మాటలు, కంటి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రుణాలు, ప్రత్యర్థుల విషయాల్లో ప్రణాళిక ముఖ్యం. వారాంతంలో దూరప్రయాణాలు, ఉన్నత విద్య, ఆర్థిక అనుకూలత లభిస్తాయి.నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.