BREAKING
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు.. కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక

స్పెయిన్‌లో రైలు ప్రమాదంపై నిపుణుల దర్యాప్తు ముమ్మరం

Select Suryaa Now
స్పెయిన్‌లో రైలు ప్రమాదంపై నిపుణుల దర్యాప్తు ముమ్మరం

సూర్య అంతర్జాతీయ డెస్క్: స్పెయిన్ దేశంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రాజధాని మాడ్రిడ్ నుంచి సెవిల్లె వైపు వెళ్తున్న హై-స్పీడ్ ప్రయాణికుల రైలు, అదే మార్గంలో వెళ్తున్న మరో రైలును వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. టొలెడో ప్రావిన్స్‌లోని ఉర్డా (Urda) గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో రెండు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు కనీసం 68 మంది ప్రాణాలు కోల్పోగా, మరో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది స్పెయిన్ రైల్వే చరిత్రలో ఇది రెండవ పెద్ద ప్రమాదం కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బోగీల మధ్యలో ప్రయాణికులు ఇరుక్కుపోయారని, సహాయక సిబ్బంది గ్యాస్ కట్టర్ల సాయంతో కోచింగ్‌లను కట్ చేసి క్షతగాత్రులను బయటకు తీస్తున్నారని అత్యవసర సేవల అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే వందలాది మంది రెస్క్యూ సిబ్బంది, అంబులెన్సులు మరియు హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు ఒక్కసారిగా పెను శబ్దం వచ్చిందని, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తీవ్ర ప్రమాదం జరిగిందని కన్నీటిపర్యూమంతమయ్యారు.

ఈ ఘోర ప్రమాదంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, ఈ దుర్ఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. దేశంలోని అత్యాధునిక హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్ భద్రతపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనలను తొలగించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. సిగ్నలింగ్ వైఫల్యమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో రైల్వే భద్రతా అధికారులు మరియు నిపుణులు దర్యాప్తును ముమ్మరం చేశారు.