బ్రెజిల్ ఎన్నికల పోరులో తీవ్ర ఉత్కంఠ
సూర్య అంతర్జాతీయ డెస్క్: లాటిన్ అమెరికా దిగ్గజ దేశమైన బ్రెజిల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాబోయే అధ్యక్ష ఎన్నికల రన్‌ఆఫ్ పోరులో ప్రస్తుత అధ్యక్షుడు లూలా డా సిల్వాకు, మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కుమారుడైన ఫ్లావియో బోల్సొనారోకు మధ్య హోరాహోరీ పోరు సాగనున్నట్లు తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ సంస్థ సిఎన్‌టిఎమ్‌డిఏ విడుదల చేసిన తాజా ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలు ఇద్దరు అభ్య్రధుల మధ్య ఓట్ల తేడా అత్యంత స్వల్పంగా ఉండనుందని వెల్లడించడంతో దేశ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.
ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న తరుణంలో వెలువడిన ఈ సర్వే ఫలితాలు బ్రెజిల్ రాజకీయాల్లో అనూహ్య మలుపులకు అద్దం పడుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి, సామాజిక సంక్షేమ పథకాలు మరియు అవినీతి వ్యతిరేక విధానాలపై ఇరువర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు నడుస్తున్నాయి. సంప్రదాయవాద శక్తుల మద్దతుతో దూసుకెళ్తున్న ఫ్లావియో బోల్సొనారో, అట్టడుగు వర్గాల ఓటు బ్యాంకును నమ్ముకున్న లూలాకు గట్టి పోటీ ఇస్తుండటంతో గెలుపు ఎవరిని వరిస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ప్రధానంగా దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు పన్నుల విధానం వంటి అంశాలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన విషయాలుగా నిలిచాయి. ఇరు అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న వాగ్దానాలను గుప్పిస్తున్నారు. రన్‌ఆఫ్ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ బ్రెజిల్ రాజకీయ యవనికపై అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ సమాజం సైతం ఈ ఎన్నికలపై ప్రత్యేక నిఘా ఉంచింది.