లక్కవరంలో టీడీపీలోకి వైసీపీ కుటుంబాలు
లక్కవరంలో టీడీపీలోకి వైసీపీ కుటుంబాలు
30 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక
గొట్టిపాటి లక్ష్మీ సమక్షంలో పసుపు కండువాలు
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సమక్షంలో తాళ్లూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన 30 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దర్శి నియోజకవర్గంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అనుసరిస్తున్న విధానాలపై విశ్వాసంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నట్లు కొత్తగా చేరిన కుటుంబాల సభ్యులు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, పార్టీలో చేరిన కార్యకర్తలకు అండగా ఉంటానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు హనుమారెడ్డి, ఆవుల ఆదినారాయణ, లక్ష్మీరెడ్డి, మాజీ ఎంపీటీసీ సుబ్బారెడ్డి, సంపతి శ్రీను, కొత్తమారం పేరిరెడ్డి, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో తూము కామిరెడ్డి, తూము పేరిరెడ్డి, లోకిరెడ్డి నరసింహారెడ్డి, చిన్న నరసింహారెడ్డి, కాటం బుక్కిరెడ్డి, సోము సుబ్బారెడ్డి, తూము వెంకటరమణారెడ్డి, బిజ్జం పాపిరెడ్డి, బిజ్జం నాగిరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, పాపిరెడ్డి, భూమా శ్రీను, కూకట్ల నరసింహారావు, శ్రీను (పంతులు), రామకృష్ణ, బల్లిహరవ రమణయ్య, కొండ్రు ఆదిశేషు, విప్పర్ల రామారావు, వెంకట్రావు, ఆరతోటి నరసింహారావు, ఆదాము, దాసు, ప్రభాకరరావు, పరిశుద్ధం, వెలాశ, దివన బాబు, ఎలియా తదితరులు ఉన్నారు.