BREAKING
ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు...ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఒడిశాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం: కంధమాల్, బౌద్ జిల్లాల్లో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)! ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని బురిడీ : గుజరాత్ అంబాజీ ఆలయ మోహన్‌థాల్ ప్రసాదానికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్): పవిత్ర నైవేద్యానికి దక్కిన విశిష్ట గౌరవం!

వంటింట నిత్యావసర ధరల మంట..!

Select Suryaa Now
వంటింట నిత్యావసర ధరల మంట..!


- అమ్మో కొనలేము తినలేముంటున్న సామాన్యుడు..
- ధరల పెరుగుదలను నియంత్రించాలని  వేడుకోలు..
నరసన్నపేట
నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజల బతుకులు భారంగా మారుతున్నాయి. బియ్యం నుంచి పప్పులు, వంటనూనె, ఉల్లిపాయల, కూరగాయలు, వరకు అన్ని రకాల సరుకుల ధరలు పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయాలతో సతమతమవుతున్న ప్రజలకు నిత్యావసర ధరల పెరుగుదల గుదిబండగా మారింది.

బియ్యం బస్తా కొనాలంటేనే బెంబేలు!

ప్రస్తుతం 26 కిలోల బియ్యం బస్తా ధర రూ.2,000 నుంచి రూ.2,500 వరకు పలుకుతుండటంతో వినియోగదారులపై ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు పప్పుల ధరలు కిలో రూ.200 వరకు చేరగా, వంటనూనె ప్యాకెట్ ధర రూ.200 వరకు ఉంటోంది. ఉల్లిపాయల ధరలు కిలో రూ.70 వరకు పలుకుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. వీటికి తోడు ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగడంతో నెలవారీ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి.

ఆదాయం అంతంతే.. ఖర్చులు కొండంత!

రోజువారీ కూలి పనులు చేసుకునే కార్మికులు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు ధరల భారాన్ని తట్టుకోలేకపోతున్నారు. సంపాదనలో అధిక భాగం ఆహార పదార్థాల కొనుగోలుకే ఖర్చవుతుండటంతో పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు వంటి ఇతర అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేయడం కష్టంగా మారుతోంది. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం పెరుగుతుండటంతో కుటుంబ నిర్వహణ భారంగా మారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వంటింటి బడ్జెట్‌కు చిల్లు!

గతంలో నిర్ణీత మొత్తంతో వారానికి సరిపడా సరుకులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం అదే మొత్తానికి తక్కువ సరుకులే వస్తుండటంతో కొనుగోళ్లను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా పేద కుటుంబాలు పప్పులు, ఇతర ఆహార పదార్థాల కొనుగోలులోనూ ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ధరలు పెరిగినా నిత్యావసర సరుకులను కొనకుండా ఉండలేని పరిస్థితి సామాన్యులది. దీంతో కుటుంబ అవసరాలను తగ్గించుకుంటూ రోజులు నెట్టుకురావాల్సి వస్తోంది.

ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలి

నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మార్కెట్‌లో ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో నిత్యావసర సరుకులు లభించేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఒకవైపు పెరుగుతున్న ఖర్చులు.. మరోవైపు పరిమిత ఆదాయంతో సామాన్యుడి జీవనం భారంగా మారుతోంది. నిత్యావసర ధరల నుంచి ఎప్పుడు ఉపశమనం లభిస్తుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వంటింటి ఖర్చుల భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.