విద్యావంతురాలిగా రాజకీయ అరంగేట్రం.. * విజయమే లక్ష్యంగా ముందడుగు *
భోగాపురం, సూర్య : భోగాపురం మండలంలో పోలిపల్లి కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా నడిపేన హారిక బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. విద్యావంతురాలైన హారిక బీటెక్ విద్యను అభ్యసించారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆమె, ఈసారి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. హారిక భర్త కర్రోతు పైడిరాజు తెలుగు యువత పార్లమెంటరీ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా, ఆమె మామయ్య భోగాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సుమారు 30 ఏళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తూ, మండల రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు. గతంలో ఆయన పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కూడా పనిచేశారు. దీర్ఘకాలంగా రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన హారిక, విద్యార్హతలతో పాటు కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని తోడుగా చేసుకుని ఎన్నికల బరిలోకి దిగారు. పోలిపల్లి ఎంపీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థిగా ప్రజల మద్దతు కూడగట్టి, విజయం సాధించడమే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారు.
రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.