BREAKING
యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి!

వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న మహిళకు వీల్‌చైర్..

Select Suryaa Now
వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న మహిళకు వీల్‌చైర్..

శ్రీకాకుళం, సూర్య:  ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరమైన సహాయం అందించడం అభినందనీయమని చాటుతూ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని హయత్‌నగర్ డివిజన్ రెల్లి వీధికి చెందిన వొండి అప్పలమ్మకు వీల్‌చైర్ అందజేశారు.

వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న అప్పలమ్మ పరిస్థితిని తెలుసుకున్న చీమల తారక్ ఆర్థిక సహకారం అందించారు. ఈ సహకారంతో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు శనివారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు వీల్‌చైర్‌ను అందజేశారు. ఈ సహాయం బాధితురాలికి కొంత ఊరటనివ్వడంతో పాటు, కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నంగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో చీమల తారక్, సీపాన రామారావు, కనపల తేజ, సీపాన మహేంద్ర, అప్పు యాదవ్‌తో పాటు పలువురు యువత పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.