వేములపాడు రహదారి నిర్మాణం పనులు పరిశీలన
వేములపాడు రహదారి నిర్మాణం పనులు పరిశీలన
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి నుండి వేములపాడు వరకు జరుగుతున్న డబల్ రోడ్డు నిర్మాణం పనులను కనిగిరి పట్టణ టిడిపి నాయకులు సోమవారం పరిశీలించారు .ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఈ రహదారి డబల్ రోడ్డు నిర్మాణం పనులు ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సారధ్యంలో వేగవంతంగా జరుగుతున్నాయని టీడీపి నాయకులు పేర్కొన్నారు .ఈ రహదారి డబుల్ రోడ్డుగా మారడం వల్ల కనిగిరి ,కంభం మధ్య ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా వ్యాపార ,వాణిజ్య ,రైతు ఉత్పత్తుల రవాణాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు .ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,తెలుగు యువత అధ్యక్షులు అచ్చాల రవి ,షేక్ రహీమాన్ ,బుల్లా బాలబాబు ,ఎన్ అంజినాయుడు ,షేక్ షరీఫ్ ,లక్ష్మయ్య ,నజీముద్దీన్ తదితరులు ఉన్నారు .