వెంకటాద్రిపాలెం స్కూల్ చైర్మన్ గా బత్తల
వింజమూరు మేజర్ న్యూస్ : వింజమూరు మండలం వెంకటాద్రిపాలెం ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసి చైర్మన్గా బత్తల వెంకట సులోచన వైస్ చైర్మన్ గా ఎలికా మహేశ్వరి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి లక్ష్మి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకట సులోచన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందజేస్తానని తెలిపారు అలాగే సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం నాయకులు లేటి జయన్న బత్తుల ఆనందు మల్లెల అశోక్ లేటి శోభన్ బాబు మురళి కృష్ణ మాధవ ఉప్పు వెంకటేష్ ఏడుకొండలు ఉపాధ్యాయుడు పి మాలకొండయ్య మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.