BREAKING
నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం

వీఎస్‌యూలో ప్రి-రిపబ్లిక్ డే పరేడ్ ఎంపికలు

Select Suryaa Now
వీఎస్‌యూలో ప్రి-రిపబ్లిక్ డే పరేడ్ ఎంపికలు

వీఎస్‌యూలో ప్రి-రిపబ్లిక్ డే పరేడ్ ఎంపికలు

వెంకటాచలం మేజర్ న్యూస్   :   విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రి-రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్‌కు యూనివర్సిటీ స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె. సునీత, ఏపీ స్టేట్ ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ డా. ఎం. సుధార్, హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ ఆర్. సైదా నాయక్ హాజరయ్యారు.
ఎంపికల్లో భాగంగా 110 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు ఫిజికల్ టెస్ట్, రన్నింగ్, మార్చ్‌ఫాస్ట్, డ్యాన్స్, డ్రాయింగ్, ఇంటర్వ్యూ తదితర పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వాలంటీర్లను తదుపరి దశకు ఎంపిక చేశారు.ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. అల్లం ఉదయ శంకర్ మాట్లాడుతూ.. ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన ఇద్దరు వాలంటీర్లు తదుపరి దశలో ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపారు.కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారి బి. పెంచల ప్రసాద్, మైభారత్ కేంద్రం నెల్లూరు యువజన అధికారి బి. శశికాంత్ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. బి.వి. సుబ్బారెడ్డి, డా. సుచరిత, డా. శంకర్ తదితరులు పాల్గొన్నారు.