BREAKING
పులివెందుల ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లపై దాడులపై విచారణకు ఆదేశాలు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం దీపావళి జ్ఞాన జ్యోతి వెలుగులు ప్రతి ఇంట్లో వెలగాలి అనే ఉద్దేశం తో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం. కిష్త్వార్‌లో అత్యాధునిక భూకంప పరిశీలన కేంద్రం ప్రారంభం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్లేట్‌లెట్ మార్పులతో ముందస్తు గుర్తింపు సాధ్యమని వెల్లడించిన పరిశోధన నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఖేత్ బచావో అభియాన్' ‘సమ్మర్ హాలిడేస్’ పిల్లలు నటించిన పెద్దల సినిమా: దర్శకుడు శ్రీకర్ నయన్ ఆసక్తికర విశేషాలు! మురాసు తుపానుపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్వర్ తుగ్గలి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం హోరు* *టిడిపి - బిజెపి పార్టీలు మధ్య సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి ప్రజావాణికి 57 వినతులు -ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: -జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అక్టోబర్‌లో 54.7కి పడిపోయిన పీఎంఐ సూచీ.. ఎగుమతుల్లో మాత్రం రికార్డు జోరు కూటమి లో లొల్లి... పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక!! ఓట్ల లెక్కింపు నకు ఏర్పాట్లు పూర్తి

వర్షాలు నేపద్యంలో ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి

Select Suryaa Now
వర్షాలు నేపద్యంలో ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి

సీతానగరం, సూర్య : వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు అవసరమని, కాలానుగున రుగ్మతలకు ఆయుర్వేదంతో ఉపశమనం ఉంటుందని జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ టి. హేమాక్షి తెలిపారు. ఈ మేరకు సోమవారం నీలకంఠాపురం (చిన్నయ్యవలస) గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. దగ్గు , పడిశం, వాతం, ఇతర సీజనల్ రుగ్మతలకు డాక్టర్ హేమాక్షి తనిఖీలు నిర్వహించి చికిత్స అందించారు. అవసరమైన ఆయుర్వేద మందులు సిబ్బంది అందజేసి వినియోగించే విధానాన్ని వివరించారు. వర్షాలు కారణంగా ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని, సాధ్యమైనంతవరకు వేడిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని, పిల్లలు వర్షంలో తడవకుండా జాగ్రత్తపడాలని, ఆవిరి పట్టడంతో శ్వాస సునాయాసం అవుతుందని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. ఇటువంటి రుగ్మతలకు ఆయుర్వేదంతో మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ స్టాఫ్ పద్మ తదితరులు పాల్గొన్నారు.