వర్మీ కంపోస్ట్ తయారిపై శిక్షణ
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం ఆత్మకూరు మండలంలోని కరటంపాడు గ్రామపంచాయతీ నందు గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నందు ఆత్మకూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అందరికీ తడి చెత్త నుండి వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ శిక్షణ కార్యక్రమం ఎంపిడివో పి. రఫీఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించగా డిప్యూటీ ఎంపీడీవోలు భువనేశ్వరి మరియు మాల్యాద్రి పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీవో రఫీ ఖాన్ ప్రసంగించారు.మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామపంచాయతీలో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలలో ఈ నెల 31నాటికి ఒకటన్ను వర్మీ కంపోస్టు తయారుచేసి ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా మార్కెటింగ్ చేయడానికి ఈ శిక్షణా కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వడం జరిగిందన్నారు.సదరు శిక్షణా కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్లు మరియు గ్రీన్ గార్డులను వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఘనంగా సత్కరించారు.