BREAKING
అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం కళ్యాణదుర్గం టి - సర్కిల్ అభివృద్ధి పనులకు శ్రీ కారం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి అర్హులైన పట్టభద్రులు ఫారం- 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కళ్యాణదుర్గం కొల్లాపూరమ్మ ఆలయం లో చోరీ.

వల్లూరుకు జిల్లా ప్రథమ స్థానం - స్వచ్ఛ రథం నిర్వహణలో డిప్యూటీ ఎంపీడీవో రమేష్‌కు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు..

Select Suryaa Now
వల్లూరుకు  జిల్లా ప్రథమ స్థానం - స్వచ్ఛ రథం నిర్వహణలో  డిప్యూటీ ఎంపీడీవో రమేష్‌కు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు..

వల్లూరుకు 
జిల్లా ప్రథమ స్థానం - స్వచ్ఛ రథం నిర్వహణలో

డిప్యూటీ ఎంపీడీవో రమేష్‌కు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు..

వల్లూరు మేజర్ న్యూస్

వైఎస్సార్ కడప జిల్లాలో స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో, సమర్థవంతంగా నిర్వహించినందుకు వల్లూరు మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం లభించింది. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, స్వచ్ఛత కార్యక్రమాలను క్రమపద్ధతిలో అమలు చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వల్లూరుకు ఈ గుర్తింపు లభించింది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన శుక్రవారం సాయంత్రం కడప కలెక్టరేట్‌లోని సభాభవనంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు - 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి చేతుల మీదుగా వల్లూరు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ మెమొంటో, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. వల్లూరు మండలంలో స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేయడం వంటి చర్యలను జిల్లా అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో రమేష్‌ను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. స్వచ్ఛ రథం కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పరిసరాల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమాన్ని వల్లూరు మండలంలో సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది, ప్రజలు సమన్వయంతో పనిచేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ వల్లూరు మండలానికి జిల్లా స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు తన ఒక్కరి కృషికి మాత్రమే కాకుండా, స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, ప్రజల సమిష్టి కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ వల్లూరును పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా నిలిపేందుకు అందరి సహకారంతో మరింత కృషి చేస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో వల్లూరుకు ప్రథమ స్థానం లభించడం మండల ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది. స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతంగా కార్యక్రమాలను నిర్వహించిన డిప్యూటీ ఎంపీడీవో రమేష్‌కు లభించిన ఈ ప్రశంసాపత్రం, మెమొంటో వల్లూరు మండలానికి లభించిన ప్రత్యేక గౌరవంగా స్థానికులు పేర్కొన్నారు..