వైసీపీని వీడి 100 కుటుంబాలు చిన్న శ్రీను సిరమ్మ సమక్షంలో టీడీపీ లో చేరిక
విజయనగరం, సూర్య: విజయనగరంలోని 14వ వార్డ్, తూర్పు బలిజి వీధికి చెందిన, ఇటీవల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా రాజీనామా చేసిన కనకల రఘురామారావు ఆధ్వర్యంలో శనివారం సుమారు 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలుగు దేశంపార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , కుమార్తె తెలుగుదేశం పార్టీ నాయకురాలు మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చిన్న శ్రీను , సిరమ్మ వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ మనందరం తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచే యాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో కనకల రఘు రామారావు, కనకల గిరి మరియు 14 వార్డుకి చెందిన 100 కుటుంబాలు నాయకులు పాల్గొన్నారు.