వైసీపీ మేయర్ అభ్యర్థి గంటా మోహన్ రావు నామినేషన్ దాఖలు
ఏలూరు, మేజర్ న్యూస్ : ఏలూరు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా గంటా మోహన్ రావు శనివారం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఏలూరు ఇన్చార్జి జయ ప్రకాష్, ఎమ్మెల్సీ వంక రవీంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, మాజీ కార్పొరేటర్ జుజ్జువరపు విజయ నిర్మల తదితరులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పేదల పక్షాన ,మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని మోహన్ రావు పేర్కొన్నారు.