BREAKING
కేంద్రీయ విద్యాలయాల ఆధునీకరణకు శ్రీకారం సైనిక సన్నద్ధతలో ఆశ్చర్యకరమైన వ్యూహాలు, సాంకేతిక ఆధిక్యతే కీలకం పొన్నూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత...... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పలమనేరు గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు పలు విజ్ఞాన కార్యక్రమాలు అండర్-19 ఆసియాకప్‌ ఫైనల్‌కు భారత్.. అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలురాయి తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధికి సైయంట్ సుముఖత. -సైయంట్ ప్రెసిడెంట్ నరసింహంతో మంత్రి నారా లోకేష్ సమావేశం శివాలయంలో ఎమ్మెల్యే జన్మదినోత్సవం ఈ నెల 15న హైదరాబాదులో జరిగే "హలో నేతకాని చలో ఉస్మానియా" పోస్టర్ల విడుదల కెమెరాలు తక్కువగా, అనుబంధాలు బలంగా ఉండేవి...ప్రధాని మోదీ జర్నలిస్టులతో జ్ఞాపకాలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ 2026లో అధికార పార్టీ ఒత్తిళ్లను ఎదుర్కొని వైసీపీ వీరోచిత పోరు... 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి* *సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి

వైఎస్ జగన్‌ను కలిసిన కోరుకొండ వైఎస్సార్‌సీపీ విజేత ఎంపీటీసీ సభ్యులు: అభినందించిన అధినేత

Select Suryaa Now
వైఎస్ జగన్‌ను కలిసిన కోరుకొండ వైఎస్సార్‌సీపీ విజేత ఎంపీటీసీ సభ్యులు: అభినందించిన అధినేత

సూర్య ఏపీ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ మండలంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించిన అభ్యర్థులు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా సారథ్యంలో గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులు బుధవారం రాత్రి జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలను జక్కంపూడి రాజా పార్టీ అధినేతకు పరిచయం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, రాజానగరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మెరుగైన ఫలితాలు సాధించడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ఎంపీటీసీ సభ్యులతో పాటు వారి గెలుపు కోసం కృషి చేసిన జక్కంపూడి రాజాను జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా కోరుకొండ మండలంలో జనసేన పార్టీ ఎంపీపీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించిన పెన్నాడ సుమను జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

అనంతరం ఎంపీటీసీ సభ్యులకు జగన్ భరోసా కల్పిస్తూ దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పార్టీ సానుభూతిపరుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఎంపీటీసీ సభ్యులు పట్నాల సత్యనారాయణ (కోటికేశవరం), నేతుల లక్ష్మీనారాయణ, వెంకట దుర్గా కళ్యాణి (కోరుకొండ-1), కొండము లక్ష్మి (కాపవరం), అనపర్తి మణికంఠ (బుచ్చంపేట), తుమ్మల లక్ష్మి (జగన్నాధపురం), మొకమాటి (జంబుపట్నం), గొడ్డు మహాలక్ష్మి, కర్రీ నాగదుర్గ వెంకటేశ్వరరావు (దోసకాయలపల్లి), దాడి శ్రీను (నిడిగట్ల) తదితరులు ఉన్నారు.