BREAKING
మున్సిపాలిటీ పై వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన చెన్నైలో తుదిశ్వాస విడిచిన విలక్షణ సినీ సృష్టికర్త ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డు అందుకున్న మాచవరం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు ఘన సన్మానం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... మాజీ ఎంపీ చింతా అనురాధ... పే స్కేల్ అమలు, నామినీ విఆర్ఎ ల రెగ్యులరైజ్, ప్రమోషన్ల కల్పన కోసం విఆర్ఎ ల ఆర్తనాదం రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు రోజువారీ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునే సులభమైన మార్గాలు.. మానసిక ప్రశాంతత కోసం ఇవి పాటించండి అధికంగా చక్కెర తింటున్నారా.. శరీరంలో ప్రాణాంతక మార్పులు ఖాయం! జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు

తుఫాన్‌ షెల్టర్‌కు రక్షణేది?

Select Suryaa Now
తుఫాన్‌ షెల్టర్‌కు రక్షణేది?

 

∆. అర్ధరాత్రివేళ ఇతర గ్రామాల యువకుల సంచారం
∆. నౌపడలో వెలుగుచూసిన ఘటన

∆. తాళాలు లేకుండా 
∆. భవనం పర్యవేక్షణపై గ్రామస్తుల ప్రశ్నలు

సంతబొమ్మాళి, అక్టోబర్‌ 2, మేజర్ న్యూస్ :

తుఫాన్లు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన తుఫాన్‌ షెల్టర్‌ ఇప్పుడు భద్రతకు దూరంగా ఉందా,  పర్యవేక్షణ కొరవడటంతో రాత్రివేళల్లో ఇతర గ్రామాలకు చెందిన యువకులు అక్కడికి వస్తున్నారా, నౌపడ గ్రామంలోని తుఫాన్‌ బిల్డింగ్‌ షెల్టర్‌ పరిస్థితిపై ప్రస్తుతం ఇవే ప్రశ్నలు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో తుఫాన్లను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అత్యవసర సమయంలో ఆశ్రయం కల్పించేందుకు పలు గ్రామాల్లో తుఫాన్‌ షెల్టర్లను నిర్మించారు. అయితే కాలక్రమేణా వాటి నిర్వహణపై నిర్లక్ష్యం నెలకొనడంతో అనేక భవనాలు వినియోగానికి దూరమవుతున్నాయి. ఇదే పరిస్థితి నౌపడలోని తుఫాన్‌ షెల్టర్‌లోనూ కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. గురువారం రాత్రి ఇతర గ్రామానికి చెందిన ఓ మైనర్‌ యువకుడు నౌపడ తుఫాన్‌ బిల్డింగ్‌లో ఒంటరిగా ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. రాత్రివేళ ఆ ప్రాంతంలో సంచరిస్తున్న యువకుడు పలువురి దృష్టికి రావడంతో ఈ విషయం చర్చకు వచ్చింది. అయితే అర్ధరాత్రి సమయంలో తుఫాన్‌ షెల్టర్‌ వద్దకు ఇతర గ్రామాలకు చెందిన యువకులు రావాల్సిన అవసరం ఏమిటన్నదే ప్రస్తుతం స్థానికుల ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో షెల్టర్‌ వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల అత్యవసర అవసరాల కోసం నిర్మించిన భవనానికి తాళాలు లేకుండా ఉంచడంపై గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. భవనం ఎవరి ఆధీనంలో ఉంది, దాని నిర్వహణ బాధ్యత ఎవరిది, రాత్రివేళల్లో అక్కడికి ఎవరు వస్తున్నారు, ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
తుఫాన్‌ షెల్టర్‌కు తగిన భద్రత, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులకు అవకాశం ఏర్పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భవనానికి తాళాలు ఏర్పాటు చేయడంతోపాటు, నిరంతర పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తుఫాన్‌ షెల్టర్‌ను సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయాలని స్థానికులు కోరుతున్నారు. భవనం శిథిలావస్థకు చేరుతున్నట్లయితే మరమ్మతులు చేపట్టి, అత్యవసర సమయంలో ప్రజలకు ఉపయోగపడేలా సిద్ధం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమయంలో రాత్రివేళల్లో అనధికారికంగా ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.