తుపాను హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండండి
బాపట్ల, మేజర్‌న్యూస్ :
జిల్లా కలెక్టర్ డా||వినోద్ కుమార్ వి. ఐ.ఏ.ఎస్., గారు తుపాను హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
▪️ ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం నేడు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా, అర్ధరాత్రికి తుపానుగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది.
▪️ నవంబర్ 2న తీవ్ర తుపానుగా బలపడి, నవంబర్ 3 ఉదయం నెల్లూరు–నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 100–110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
▪️ రానున్న మూడు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.