BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

టీడీపీలోకి 20 కుటుంబాలు

Select Suryaa Now
టీడీపీలోకి 20 కుటుంబాలు


- ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్న వైసీపీ నాయకులు

నరసన్నపేట అక్టోబర్ 18 మేజర్ న్యూస్: నరసన్నపేట మండలం బాడాం పంచాయతీ పరిధిలోని చిన్న బాడాం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీకి చెందిన సురవరపు సద్గుణమూర్తి, చింతు సుందరరావు, చింతు సూరిబాబు, యారబాటి మల్లేశ్వరరావు, యర్లెంకి అప్పలనాయుడు, నడుపూరి అప్పిలి, బొట్ట దొరబాబు, బమ్మిడి జయరాం, బొట్ట పరమేశ్వరి, జామ్మన భూలక్ష్మి తదితరులతో పాటు సుమారు 20 కుటుంబాల సభ్యులు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కూటమి పాలనకు ఆకర్షితులై చేరిక

టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నరసన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందిస్తున్న ప్రజామోదయోగ్యమైన పాలనకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి, భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాడేల కోటిబాబు, యూనిట్ ఇన్‌ఛార్జి శివాల అనీల్ నాయుడు, కొత్తూరు జగజ్జీవనరావు, తమ్మినేని అప్పన్న తదితరులు పాల్గొన్నారు.