BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు ! పట్టుదలతో.. ఉద్యోగి నుంచి మీడియా సంస్థ CEO వరకు: కోటా సాయికుమార్ జీవిత ప్రయాణం ఒరిజినల్ పత్రాలతో అగ్రిగోల్డ్ బాధితులు పరిశీలనకు వెళ్లాలి. సిమెంట్ రోడ్ల నిర్మాణం -సైడ్ కాలవలు శూన్యం --కక్షా..వివక్షా.... మహబూబాబాద్ జిల్లాలో విషాదం: బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి ఆకాశాన్ని అంటుతున్న తున్న నిత్యవసర లు ధరలు అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ* *అందమైనబతుకమ్మలతోపోటీపడినమహిళలు* *సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్* హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు- పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు.. రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత

తాడిపత్రిలో ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ 10 ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ స్వాధీనం.. 31 మద్యం సీసాలు పట్టివేత 249 మంది పోలీసులతో విస్తృత కార్డన్‌ అండ్‌ సెర్చ్‌.. ఒకరి అరెస్ట్‌

Select Suryaa Now
తాడిపత్రిలో ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’  10 ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ స్వాధీనం.. 31 మద్యం సీసాలు పట్టివేత  249 మంది పోలీసులతో విస్తృత కార్డన్‌ అండ్‌ సెర్చ్‌.. ఒకరి అరెస్ట్‌

అనంతపురం బ్యూరో : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా తాడిపత్రిలో పోలీసులు ‘ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌’ పేరుతో శనివారం విస్తృత కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో మొత్తం 249 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు

తాడిపత్రి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టైలర్స్‌ కాలనీ, నందలపాడు ప్రాంతాలతో పాటు తాడిపత్రి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇగుడూరు, గంగాదేవిపల్లి, వెంకటరెడ్డిపల్లి, బోడాయిపల్లి, ఆలూరు గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 90 ఇళ్లను తనిఖీ చేసి, 140 మందిని విచారించారు.

వాహనాలు, మద్యం సీసాలు స్వాధీనం

ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు 10 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 180 ఎం.ఎల్‌ సామర్థ్యం కలిగిన 31 అడ్మిరల్‌ మద్యం సీసాలను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం

ప్రజలకు భద్రత కల్పించడం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, చట్టవ్యతిరేక చర్యలను నియంత్రించడం లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇటువంటి తనిఖీలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.