స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ‘సేవలో నా భాగస్వామ్యం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్ కాతేరు చేనేత సొసైటీలో ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాన్ని నిర్వహించి స్వదేశీ చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, జిల్లా ఎన్‌జీవో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వదేశీ వస్త్రాలను కొనుగోలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదంతో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్త్రాలను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. స్వదేశీ అనేది కేవలం నినాదం కాదని, అది మన జీవన విధానంగా మారాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పిక్కి నాగేంద్ర, బొమ్ముల దత్తు, మాధవరావు, రేలంగి శ్రీదేవి, కురగంటి సతీష్, నర్సిపల్లి హారిక, కవికొండల శ్రీనివాస్, అడబాల రామకృష్ణ, యానాపు ఏసు, బాక్స్ ప్రసాద్, ఏ.వి. రమణ, మద్దిపాటి రజనీ, డా. అనురాధ, బూరా రామచంద్రరావు, తగరం సురేష్, పాతూరి రవి, అత్తిలి ఈశ్వర్, గుంతముక్కల శ్రీనివాస్, టెకి శంకర్ తదితరులు పాల్గొన్నారు.